Pawan – Balayya : అన్‌స్టాపబుల్‌కి పవన్ కళ్యాణ్.. నేడు ఎపిసోడ్ షూటింగ్..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 04:40 PM

Pawan – Balayya : అన్‌స్టాపబుల్‌కి పవన్ కళ్యాణ్.. నేడు ఎపిసోడ్ షూటింగ్..

Pawan – Balayya : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటికే ఈ షోకి చంద్రబాబు నాయుడు, ప్రభాస్ లాంటి వారిని తీసుకు వచ్చి ఓటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య.. ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాయడానికి ప్లాన్ వేశాడు.

Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు!

గత కొన్ని రోజులుగా ఈ టాక్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఇవాళ పవన్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని జరుపుకున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చోటు చేసుకోగా, అక్కడికి మెగా-నందమూరి అభిమానులు భారీగా తరలి వచ్చారు హంగామా చేశారు. ఇక ఈ షూటింగ్ సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి, రాజకీయ కార్యాచరణ గురించి, అలాగే మెగా నందమూరి కుటుంబాల మధ్య ఉన్న అపోహలు గురించి బాలయ్య ప్రశ్నించబోతున్నాడా అన్నదే అందరిలో ఆశక్తిని రేపుతోంది. అవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇదే ఈ సీజన్ కి చివరి ఎపిసోడ్ కానుంది అంటా. ఇక ప్రభాస్ ఎపిసోడ్ ఈ శనివారం న్యూ ఇయర్ కానుకగా ప్రసారం కాబోతుంది.