NTR : ఆస్కార్‌ లిస్ట్‌లో ఇండియా నుంచి ఫస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఆస్కార్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫారిన్ మీడియానే రాసుకోచుండి. తాజాగా వరల్డ్ పాపులర్ వెరైటీ మ్యాగజైన్..

Kaburulu

Kaburulu Desk

January 5, 2023 | 07:24 PM

NTR : ఆస్కార్‌ లిస్ట్‌లో ఇండియా నుంచి ఫస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్..

NTR : జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీ అయినా, డాన్స్ స్టెప్పులైనా, కామెడీ అయినా, ఎమోషన్ అయినా అలవోకగా చేసేస్తూ కంప్లీట్ యాక్టర్ అనిపించుకుంటాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో తన నటనా విశ్వరూపం చూపించాడు. ‘కొమరం భీముడో’ సాంగ్ లో కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించి ప్రేక్షకులను ఏడిపించాడు.

బియాండ్ ఫెస్ట్‌లో RRR రికార్డు.. న్యూయార్క్‌లో రాజమౌళికి అవార్డు..

ఇక ఈ సినిమా చూసిన విదేశీలు సైతం తారక్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఆస్కార్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫారిన్ మీడియానే రాసుకోచుండి. తాజాగా వరల్డ్ పాపులర్ ‘వెరైటీ మ్యాగజైన్’ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ గెలుచుకొనే అవకాశం ఉన్న 10 మంది నటులు జాబితాని విడుదల చేసింది. ఈ ప్రెడిక్షన్ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్‌ కూడా స్థానం దక్కించుకున్నాడు.

ఇప్పటి వరకు ఈ జాబితాలో ఏ ఇండియన్ యాక్టర్ చోటు దక్కించుకోలేదు. ఫస్ట్ టైం భారత్ తరుపు నుంచి ఈ టాప్ 10 ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రెడిక్షన్ లిస్టులో స్థానాన్ని దక్కించుకొని ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఉన్నాడు. వచ్చే నెల నుంచి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్లు తెలుస్తుంది.