Ranveer Singh : ఆ న్యూడ్ ఫోటోలు నావి కావు.. మార్ఫింగ్ చేశారు.. రణవీర్ కేసులో కొత్త ట్విస్ట్..

Kaburulu

Kaburulu Desk

September 15, 2022 | 02:10 PM

Ranveer Singh : ఆ న్యూడ్ ఫోటోలు నావి కావు.. మార్ఫింగ్ చేశారు.. రణవీర్ కేసులో కొత్త ట్విస్ట్..

Ranveer Singh :  ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ గా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మ్యాగజైన్ కూడా రణవీర్ ని ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోలని పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అలా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చాలా మంది ఈ విషయంలో రణవీర్ ని విమర్శించారు. కొంతమంది సపోర్ట్ చేశారు.

అయితే ముంబైలోని ఓ సామాజిక సంస్థ ఈ న్యూడ్ ఫోటోల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని రణవీర్ పై కేసు వేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇప్పటికే ఒకసారి రణవీర్ సింగ్ ని విచారించారు. ఇన్నాళ్లు అవి తన ఫొటోలే అంటూ, అధికారికంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేసిన రణవీర్ ఇప్పుడు మాట మార్చాడు.

Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

తాజాగా ఇవాళ జరిగిన విచారణలో రణవీర్ ఆ ఫోటోలు తనవి కావని, ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టారని పోలీసులకి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తానే అధికారికంగా పోస్ట్ చేసి, మ్యాగజైన్ కోసం దిగానని చెప్పి ఇప్పుడు ఇలా చెప్పడంతో మరోసారి నెటిజన్లు రణవీర్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.