RRR : ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్..

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 08:35 PM

RRR : ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్..

RRR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయినా ఆయన్ని ఆకాశానికెత్తేశారు కూడా. హాలీవుడ్ పేపర్లు, మ్యాగజైన్స్ లలో RRR సినిమా, రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్స్ కూడా రాశారు.

ఇప్పటికే హాలీవుడ్ లో రాజమౌళి, RRR సినిమా వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకోగా ఆస్కార్ టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. రాజమౌళి గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంది RRR సినిమాని ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ కి ఏ విభాగంలో కుదిరితే ఆ విభాగంలో RRR సినిమాని పంపించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆస్కార్ సందడి మొదలవ్వగా తాజాగా బుధవారం నాడు ఆస్కార్ కొన్ని విభాగాల్లో షార్ట్ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఇండియా సినిమా నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ సాంగ్ ఇదే కావడం విశేషం. దీంతో సినిమా యూనిట్ తో పాటు, అభిమానులు, తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో నాటు నాటు సాంగ్ నిలిచింది.

Anupama Parameswaran : రంగస్థలం సినిమాలో హీరోయిన్‌గా అనుపమ చేయాల్సింది.. సుకుమార్!

ఈ విభాగంలో ఆస్కార్ కి మొత్తం 81 పాటలు పరిశీలనకు రాగా 15 సాంగ్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 15లో జడ్జిలతో పాటు ఓటింగ్ ద్వారా కూడా ఎక్కువ ఓట్లు దేనికి వస్తే అదే ఈ సారి ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ అవార్డు గెలుచుకుంటుంది. మరి ఈ సారి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చి కీరవాణి ఆస్కార్ అందుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి.