Pathaan : ‘పఠాన్’పై ముస్లిం సంఘాలు ఆగ్రహం..

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 08:18 PM

Pathaan : ‘పఠాన్’పై ముస్లిం సంఘాలు ఆగ్రహం..

Pathaan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా..

ఈ సినిమా నుంచి ఇటీవల ‘బేషరం రంగ్’ అనే సాంగ్‌ని విడుదల చేయగా, పాటలో అశ్లీలత ఎక్కువ ఉందంటూ విమర్శలు ఎదురుకుంటుంది. ఈ పాటని సినిమా నుంచి తొలిగించాలి అంటూ నెటిజెన్లు నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటపై ముస్లిం సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లోని ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ.. బేషరం రంగ్ పాటపై అభ్యంతరం తెలియజేశాడు. ఇస్లాం మతాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాలోని పలు అభ్యంతరకర సన్నివేశాల గురించి తమకి పిర్యాదులు వచ్చాయని, వాటిని మూవీ నుంచి తొలిగించాలి అంటూ డిమాండ్ చేశాడు. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.