Michael Review : కొత్త ఎలివేషన్స్, మ్యూజిక్ తోనే.. పాత కథని ప్రేక్షకుల ముందు పెట్టిన మైఖేల్..

సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్.. ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని తెరకెక్కించారు. సందీప్ గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో ఉండటంతో..............

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 02:17 PM

Michael Review : కొత్త ఎలివేషన్స్, మ్యూజిక్ తోనే.. పాత కథని ప్రేక్షకుల ముందు పెట్టిన మైఖేల్..

Michael Review :  సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్.. ముఖ్య పాత్రల్లో రంజిత్ జైకొడి ఈ సినిమాని తెరకెక్కించారు. సందీప్ గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే మైఖేల్ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ లో ప్రమోషన్స్ బాగా చేశారు. తమిళ్ లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని రిలీజ్ చేయడంతో తమిళ్ లో మరింత బజ్ ఏర్పడింది.

కథ విషయానికొస్తే బాలు, పంజా.. లాంటి సినిమాల్లాగే ఉంటుంది. ఓ అనాథ(సందీప్ కిషన్) ఒక పెద్ద డాన్(గౌతమ్ మీనన్) దగ్గరకు వస్తాడు. ఆయన కింద పనిచేసేవాళ్ళ దగ్గరే పెరుగుతాడు. ఒకానొక సమయంలో మైఖేల్ ఆ డాన్ ని వేరేవాళ్లనుంచి రక్షించడంతో డాన్ కి దగ్గరవుతాడు. దీంతో డాన్ సందీప్ కి బిజినెస్ లు, కొన్ని పనులు అప్పచెప్తూ ఉంటాడు. డాన్ సందీప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం డాన్ కొడుకు (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ)కి నచ్చదు. ఒకసారి డాన్ ఒకర్ని చంపి రమ్మని సందీప్ కిషన్ ని పంపిస్తే అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి చంపకపోవడంతో ఇదే టైం అనుకోని డాన్ కొడుకు సందీప్ కిషన్ ని చంపేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. అయితే సందీప్ చావకుండా బతికి ఉండటంతో తిరిగి ఎలా వచ్చాడు? రివెంజ్ తీర్చుకున్నాడా? ఆ అమ్మాయిని కాపాడుకున్నాడా? డాన్ కి ఏం చెప్పాడు? అసలు విజయ్ సేతుపతికి, సందీప్ కిషన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా కథ చూస్తున్నంతసేపు బాలు, పంజా సినిమా కథే అనిపిస్తుంది. ఇక కథనం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే 90s లో కథ నడుస్తుంది. సినిమా నెరేషన్ KGF స్టైల్ లో ట్రై చేశారు. హీరోకి ఎలివేషన్ ఇవ్వడం, వాయిస్ ఓవర్ తో కథ చెప్పడం లాంటివి ట్రై చేశారు. కథ పాతదే అవ్వడంతో అంత ఆసక్తిగా అనిపించదు. సెకండ్ హాఫ్ లో ఒక రెండు ట్విస్ట్ లు వచ్చినా అవి ప్రేక్షకులు ముందే ఊహించగలరు. అందులోను ఇటీవల ఎక్కువగా ఇలాంటి డాన్ సినిమాలు వస్తున్నాయి. అయితే సందీప్ కిషన్ బాడీకి ఈ డాన్ సినిమా అస్సలు సూట్ అవ్వలేదు. కొన్ని చోట్ల సందీప్ కి మరీ ఎక్కువ ఎలివేషన్ ఇవ్వడంతో ఓవర్ గా అనిపిస్తుంది.

సందీప్ మాత్రం ఈ సినిమాకి కష్టపడ్డాడు, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఈ రేంజ్ క్యారెక్టర్స్ లో పవన్ కళ్యాణ్, యశ్ లని చూశాకా సందీప్ ని చూస్తే అస్సలు సెట్ అవ్వడు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పర్వాలేదనిపించినా ఆమెని డ్యాన్సర్ గా చూపించడంతో ఆమె డ్యాన్స్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. వరలక్షి శరత్ కుమార్ ఒక 5 నిముషాలు మాత్రమే కనిపిస్తుంది. విజయ్ సేతుపతి క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ బాగుంటాయి. గౌతమ్ మీనన్ డాన్ గా పర్వాలేదనిపించాడు. అనసూయ యాక్టింగ్ కొన్నిచోట్ల మరీ ఓవర్ గా అనిపిస్తుంది. వరుణ్ సందేశ్ కి కూడా ఆ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు. సినిమాలో కామెడీ ఎలాగో లేదు. ఒక్క పాట మాత్రమే రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది.

Nijam with Smita : అన్‌స్టాపబుల్ పోటీగా స్మిత కొత్త టాక్ షో.. చరణ్ పై నాని వైరల్ కామెంట్స్!

సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. సామ్ CS సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా కాస్తో కూస్తో నిలబడింది అంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. కెమెరా వర్క్ బాగుంది. వీకెండ్ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

*ఈ రివ్యూ కేవలం మా అభిప్రాయం మాత్రమే..