Michael Trailer : మైఖేల్ ట్రైలర్ రిలీజ్.. సందీప్ కిషన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా..

సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్, అయ్యప్ప శర్మ ముఖ్యపాత్రలతో భారీగా తెరకెక్కుతున్న మైఖేల్ సినిమా...........

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 02:32 PM

Michael Trailer : మైఖేల్ ట్రైలర్ రిలీజ్.. సందీప్ కిషన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా..

Michael Trailer :  వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎదిగిన సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. సందీప్ హీరోగా, నిర్మాతగా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉన్నాడు. కొంచెం గ్యాప్ తీసుకొని ఒక రా అండ్ ఇంటెన్స్ సినిమా మైఖేల్ తో రాబోతున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకు తగ్గట్టే స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్, అయ్యప్ప శర్మ ముఖ్యపాత్రలతో భారీగా తెరకెక్కుతున్న మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కథ మాత్రం కనపడకుండా రకరకాల షాట్స్ ని కలిపి చూపించాడు డైరెక్టర్ రంజిత్. ట్రైలర్ చూస్తుంటే గ్యాంగ్ వార్స్, లోకల్ డాన్స్ లాంటి 80, 90వ దశకంలో కథలా అనిపిస్తుంది. అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ లాగే చూపించాడు. అందరూ చంపుకోవడం, కొట్టుకోవడం లాంటి సీన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ట్రైలర్ చివర్లో మాత్రం ఇదంతా ఒక అమ్మాయి కోసమే అని సందీప్ కిషన్ చెప్తాడు. దీంతో హీరో లవర్ కి ఏదైనా జరిగితే ప్రతీకారం తీర్చుకునే కథలా అనిపిస్తుంది. కానీ కథ ఏమి ట్రైలర్ లో చెప్పకపోవడం, రా అండ్ ఇంటెన్స్ విజువల్స్ ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

Kangana Ranaut : సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టిన స్టార్ హీరోయిన్..

ఇంతమంది స్టార్ కాస్టింగ్ ఉండటం, సందీప్ కిషన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై సందీప్ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ ట్రైలర్ ని బాలకృష్ణ విడుదల చేశారు. మైఖేల్ సినిమా సందీప్ కి ఏమాత్రం హిట్ ఇస్తుందో చూడాలి.