Dhamaka Movie Review : అదరగొట్టేసిన రవితేజ, శ్రీలీల.. ధమాకా రివ్యూ..

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 10:00 PM

Dhamaka Movie Review : అదరగొట్టేసిన రవితేజ, శ్రీలీల.. ధమాకా రివ్యూ..

Dhamaka Movie Review :  రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు. సినిమాకి రిలీజ్ ముందు బాగా హైప్ ఇచ్చారు చిత్ర యూనిట్. అంతా భావించినట్టే ఈ సినిమాకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే రెండు రోజులకే ధమాకా సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా కలెక్ట్ చేసి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ధమాకా కథ విషయానికొస్తే ఇద్దరు రవితేజలు ఒకరు మిడిల్ క్లాస్ లో, ఒకరు రిచ్ లో. ఎవరి లైఫ్స్ వాళ్ళవి అన్నట్టు చూపిస్తారు. మధ్యలో శ్రీలీల అనుకోకుండా ఇద్దరిని కలిసి, ఇద్దరితో లవ్ లో పడి వాళ్ళతో ట్రావెల్ అయి ఒకరికి ఓకే చెపుదాం అనుకుంటుంది. శ్రీలీల ఒకరికి ఓకే చెప్దామనుకున్న సమయానికి రిచ్ రవితేజకి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఇంట్రవెల్ కి ముందు ఇద్దరు రవితేజలు ఒకటే అని రివీల్ చేస్తారు. విలన్ రిచ్ రవితేజని చంపాడు అనుకుంటాడు. ఆ ప్లేస్ లోకి మిడిల్ క్లాస్ రవితేజ వెళ్తాడు. ఆ తర్వాత నుంచి కథ ఎలా సాగింది? విలన్ ని రవితేజ ఎలా మాయ చేశాడు? హీరోయిన్ కి ఇద్దరూ ఒకటే అని ఎలా తెలిసింది? తెలిశాక ఏం చేసింది? విలన్స్ కి ఎలా తెలిసింది? విలన్ ఎత్తుగడలని రవితేజ ఎలా తిప్పికొట్టాడు? విలన్ నుంచి తన ఫ్యామిలీలని ఎలా కాపాడుకున్నాడు? అసలు ఇద్దరిలా ఎందుకు ఉంటున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే.

ఒకరు ఇద్దరిలా నటించడం అనేది గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కొన్ని సినిమాల్లో నటించి కామెడీ, ఎమోషన్స్ తో మెప్పించారు. ఈ సినిమాని కూడా అలాగే రాసుకున్నామని చిత్రయూనిట్ ముందే చెప్పింది. చెప్పినట్టే మంచి కామెడీగా రాశారు. మొదటి హాఫ్ అంతా కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు నుంచి యాక్షన్, ట్విస్టులు, సీరియస్ డ్రామా మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సాంగ్స్ అదరగొట్టేసారు. యూట్యూబ్ లో ట్రెండ్ అయిన చింపిరి జుట్టు దాన అనే ఓ పాటని స్పెషల్ సాంగ్ లాగా వాడారు. ఈ పాట వస్తున్నప్పుడు థియేటర్స్ ఊగిపోవడం ఖాయం. తిట్లతో రాసిన ఓ పాట కూడా అందర్నీ నవ్విస్తుంది.

సినిమా మధ్యలో ఇంద్ర సినిమాలో ప్రకాష్ రాజ్ చిరంజీవి గుర్తుపట్టే సీన్ లాగే ఒక సీన్ ని పెట్టారు. రవితేజ, రావు రమేష్, శ్రీలీల మధ్య ఉండే ఆ సన్నివేశం అందర్నీ నవ్విస్తుంది. అక్కడ ఇంద్ర సినిమా మ్యూజిక్ వాడటంతో థియేటర్లో ఆ సీన్ మరింత పేలుతుంది. మొత్తానికి రవితేజ అభిమానులకి అయితే ఫుల్ మీల్స్ సినిమా ధమాకా. సాధారణ ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా బోర్ కొట్టినా సినిమా మాత్రం నచ్చుతుంది. ఇక కలెక్షన్స్ కూడా బాగుండటంతో మొత్తానికి రవితేజ మళ్ళీ హిట్ కొట్టాడు.

Dil Raju : ‘వారిసు’ సినిమా మహర్షికి రీమేక్.. స్పందించిన దిల్ రాజు!

ఇక పర్ఫార్మెన్స్ పరంగా రవితేజ రెండు రోల్స్ లో అదరగొట్టేశాడు. శ్రీలీల సీన్స్ చాలా క్యూట్ గా, అందంగా, అమాయకంగా బాగుంటాయి. శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టేసింది. మాస్ బీట్స్ లో కూడా సూపర్ గా స్టెప్పులు వేసింది. భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే అంశాలు కనిపిస్తున్నాయి శ్రీలీలలో. రైటర్ BVS రవి నటుడిగా మారి కామెడీ విలన్ గా అలరించాడు. రావు రమేష్, పక్కన హైపర్ ఆది కాంబినేషన్ కామెడీ బాగుంటుంది. విలన్ గా సీనియర్ నటుడు జయరాం బాగా చేశారు. యూట్యూబర్ మౌనిక రెడ్డి రవితేజ చెల్లెలిగా మెప్పించింది. మ్యూజిక్ డైరెక్టర్, యష్ మాస్టర్ ఓ సాంగ్ లో అలా కనిపించి మెరిపించారు. ధమాకా ఒక మాస్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా అందరికి నచ్చుతుంది. మరో రెండు రోజుల్లో కలెక్షన్స్ లో రవితేజ బ్రేక్ ఈవెన్ చేస్తాడని భావిస్తున్నారు.