Amigos : అమిగోస్ టీజర్ విడుదల.. మూడు క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేయడానికి వస్తున్న కళ్యాణ్ రామ్..

కళ్యాణ్ రామ్ హీరోగా, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ఒకే రకంగా ఉండే ముగ్గురిగా నటించబోతున్నాడు. తాజాగా అమిగోస్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 12:22 PM

Amigos : అమిగోస్ టీజర్ విడుదల.. మూడు క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేయడానికి వస్తున్న కళ్యాణ్ రామ్..

Amigos :  నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాలపై కూడా మంచి హైప్ ఏర్పడింది. మొదటి నుంచి కూడా ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు కూడా మరో ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ఒకే రకంగా ఉండే ముగ్గురిగా నటించబోతున్నాడు. గతంలో ఎన్టీఆర్ జైలవకుశ లాగే ఇందులో కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు.

Waltair Veerayya Trailer : మెగా మాస్ జాతర.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్..

తాజాగా అమిగోస్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ లో.. ఒక కళ్యాణ్ రామ్ కి ఇంకో కళ్యాణ్ రామ్ ఫోన్ చేసి నేను మైకేల్ ఫ్రమ్ కోలకత్తా. నాకు నువ్వు కావాలి, నేను నీకు లాగే ఉంటాను అని కలుస్తారు. అలా ముగ్గురు కళ్యాణ్ రామ్ లు కలిసి ఏం చేశారు? అందులో ఒక కళ్యాణ్ రామ్ విలన్ లా చూపించడంతో వాడు మిగతా ఇద్దర్ని ఏం చేశాడు అనే థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఉంది. మనం కలవడం ఓ అద్భుతం, విడిపోవడం అవసరం అనే డైలాగ్ తో సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఇక టీజర్ లో యాక్షన్ సీన్స్ ని కూడా భారీగానే చూపించారు. దీంతో అమిగోస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.