Mukhachitram Review : ముఖచిత్రం రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే??

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 06:25 PM

Mukhachitram Review : ముఖచిత్రం రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే??

Mukhachitram Review :  వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, ఆయేషాఖాన్, చైత‌న్య‌రావు మెయిన్ లీడ్స్ లో హీరో విశ్వక్సేన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ముఖ చిత్రం. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథ, మాటలు అందించగా కొత్త దర్శకుడు గంగాధర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర్నుంచి దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ లోనే కథ ఇండైరెక్ట్ గా చెప్పడంతో సినిమాపై ఆసక్తి కలిగింది,

కథ విషయానికొస్తే హీరో వికాస్ ఒక ప్లాస్టిక్ సర్జన్. హీరోని ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది. కానీ హీరో ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి సడెన్ గా ఇద్దరి హీరోయిన్స్ కి యాక్సిడెంట్ జరిగి హీరో భార్య చనిపోయి హీరోని ప్రేమిస్తున్న అమ్మాయి పేస్ పాడయిపోవడంతో హీరో భార్య పేస్ ఈ అమ్మాయికి పెడతారు. ఆ తర్వాత వచ్చే సంఘటనలేంటి? అసలు కోర్టుకి ఎందుకు వెళ్లారు, విష్వక్సేన్ ఎందుకు లాయర్ గా వచ్చాడు? విశ్వక్సేన్ ఎవరి తరపున వాదించాడు అనేవి తెరపై చూడాలి. అలాగే ఈ కథలో మంచి సందేశం కూడా ఉంది.

SSMB28 : మహేష్ బాబుకి అక్కగా సింగర్ సునీత?

కథ బాగున్నా అక్కడక్కడా స్లో నేరేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం తేలిపోతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. హీరోయిన్ ప్రియా వడ్లమాని రెండు షేడ్స్ లో అద్భుతమైన నటన కనపరిచింది. క్లైమాక్స్ ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు అనిపించింది. సినిమా మార్కెట్ కోసం విశ్వక్సేన్ ని తీసుకొచ్చినా అంతగా వాడుకోలేకపోయారనే చెప్పొచ్చు. ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుంది కానీ కథనమే ఇంకొంచెం బాగుండాల్సింది.

నోట్: సినిమాపై ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే*