Mike Tyson : లైగర్ లో చిన్న గెస్ట్ రోల్ కి మైక్ టైసన్ అంత తీసుకున్నాడా..? కానీ మనోళ్లు వాడుకోలేకపోయారు..

Kaburulu

Kaburulu Desk

September 1, 2022 | 12:09 PM

Mike Tyson : లైగర్ లో చిన్న గెస్ట్ రోల్ కి మైక్ టైసన్ అంత తీసుకున్నాడా..? కానీ మనోళ్లు వాడుకోలేకపోయారు..

Mike Tyson :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం, నిర్మాణంలో కరణ్ జోహార్ భాగమవడం, సినిమాకి ఓవర్ హైప్ తీసుకురావడంతో పాటు, సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

ఇక ఈ సినిమాలో వరల్డ్ లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని తీసుకురావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మైక్ ఒక ఇండియన్ సినిమా, అది కూడా టాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నాడు అని తెలిశాక సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దీంతో అభిమానులు విజయ్ కి, లైగర్ కి మధ్య భారీ ఫైట్స్ లేదా మోటివేషన్ టైపులో సీన్స్ ఉంటాయేమో, మైక్ టైసన్ ని భారీగా చూపిస్తారేమో అనుకున్నారు. కానీ సినిమా క్లైమాక్స్ లో అతి తక్కువ సమయం కనిపించి, అది కూడా ఒక కామెడీ ఎపిసోడ్ లాగా తీయడంతో జనాలు షాక్ అయ్యారు. ఎన్నో అంచనాలతో మైక్ కోసం థియేటర్ కి వెళ్తే మైక్ టైసన్ ని కమెడియన్ గా చూపించడంతో సినిమాకి బాగా మైనస్ అయింది.

అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా, మైక్ టైసన్ ని ఎలా చూపించినా మైక్ ఆ చిన్న పాత్ర చేయడానికి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మైక్ టైసన్ దాదాపు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మన లెక్కల్లో చూసుకుంటే అది చాలా ఎక్కువే అనిపించినా, అక్కడ మైక్ రేంజ్, అక్కడి వ్యాల్యూలో చూసుకుంటే అది మైక్ టైసన్ కి తక్కువే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక కొంతమంది అయితే 25 కోట్లిచ్చి మైక్ టైసన్ పవర్ ని సరిగ్గా వాడుకోలేకపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు.