Hit 2 Review : హిట్ 2 సినిమా రివ్యూ.. అదిరిపోయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..

Kaburulu

Kaburulu Desk

December 2, 2022 | 01:19 PM

Hit 2 Review : హిట్ 2 సినిమా రివ్యూ.. అదిరిపోయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..

Hit 2 Review :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 సినిమా తెరకెక్కింది. అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో హిట్ 2 తెరకెక్కింది. ఇక సినిమా చూసిన వాళ్ళు సినిమా అదిరిపోయింది అంటూ, థ్రిల్లింగ్ అంశాలు బాగున్నాయి అంటూ చెప్తున్నారు.

 

హిట్ 2 కథలోకి వెళ్తే.. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్రిటికల్ కేసునైనా డీల్ చేస్తాడు. అలాంటి ఆఫీసర్ కి ఒక అమ్మాయిని చంపి ముక్కలు చేశారు అనే కేసు వస్తుంది. కేసుని గంటల్లో సాల్వ్ చేస్తాను అని అంటాడు హీరో. అయితే విలన్ ఎవరో పట్టుకోలేకపోతాడు. అంతలో ముక్కలుగా కనిపించిన బాడీ దగ్గర ఉన్న ఒక్కో పార్ట్ ఒక్కొక్కరిది అని, సీరియల్ కిల్లర్ అని తెలియడంతో షాక్ అవుతాడు. మధ్యలో హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు ఉంటాయి. కిల్లర్ హీరోయిన్ ని కూడా టార్గెట్ చేస్తాడు. దీంతో హీరో ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు? ఆ కిల్లర్ ఎవరు? హీరోయిన్ ని కాపాడుకున్నాడా? ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

ముందునుంచి సినిమా యూనిట్ ప్రమోట్ చేసినట్టే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కొంచెం స్లోగా అనిపించినా ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ ఇస్తారు. ఇక సెకండ్ సెకండ్ హాఫ్ లో ఫైట్స్, ఇన్వెస్టిగేషన్ తో సాగుతుంది సినిమా. చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోద్ది. చెప్పినట్టే చివర్లో హిట్ 3 హీరో ఎవరో కూడా ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు. ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూసేయండి.

Mukhachitram Trailer : అదిరిపోయే ట్విస్టులతో ముఖచిత్రం ట్రైలర్.. విశ్వక్‌సేన్ స్పెషల్ అప్పీరెన్స్..

సినిమాకి మెయిన్ ప్లస్ అడివి శేష్. తన అద్భుతమైన నటనతో అందర్నీ మెప్పించాడు. మీనాక్షి చౌదరి లవర్ పాత్రలో, కోమలీ ప్రసాద్ అసిస్టెంట్ పాత్రలో నటించి మెప్పించారు. మిగిలిన నటులందరూ కూడా వారి పాత్రలకి తగ్గ న్యాయం చేశారు. విలన్ గా ఎవరు చేశారో చెప్తే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి తెర మీద చూసేయండి. టెక్నీకల్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ రాస్తే బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో దర్శకుడు శైలేష్ కొలను ఇంకోసారి హిట్ కొట్టాడు. మరి తర్వాత పార్ట్ హిట్ 3 ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక.