Writer Padmabhushan Review : నవ్వించి ఏడిపించిన రైటర్ పద్మభూషణ్.. పాతకాలం ప్రశ్నలకు అమ్మ సెంటిమెంట్ జోడింపు..

సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా కొత్త దర్శకుడు షణ్ముఖ్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ కలిసి సంయుక్త నిర్మాణంలో రైటర్ పద్మభూషణ్ సినిమా తెరకెక్కింది. సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించగా సినిమాపై మంచి అంచనాలు.................

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 09:12 AM

Writer Padmabhushan Review : నవ్వించి ఏడిపించిన రైటర్ పద్మభూషణ్.. పాతకాలం ప్రశ్నలకు అమ్మ సెంటిమెంట్ జోడింపు..

Writer Padmabhushan Review : షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ లో వీడియోలాలతో ఫేమస్ అయిన సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి స్టార్ అయిపోయాడు. కలర్ ఫోటో సినిమా భారీ హిట్ అవ్వడంతో సుహాస్ కి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం సుహాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా కొత్త దర్శకుడు షణ్ముఖ్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ కలిసి సంయుక్త నిర్మాణంలో రైటర్ పద్మభూషణ్ సినిమా తెరకెక్కింది. సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించగా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి ముందు నుంచి. సినిమా రిలీజ్ అయ్యాక డీసెంట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి మంచి విజయం సాధించింది.

కథ విషయానికి వస్తే.. పుస్తకాలు పిచ్చి ఉన్న ఓ యువకుడు అసిస్టెంట్ లైబ్రరియన్ గా జాబ్ చేస్తూ ఎప్పటికైనా పెద్ద రైటర్ కావాలని, బుక్స్ రిలీజ్ చేయాలని కలలు కంటూ ఓ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు. కానీ ఆ పుస్తకం ఎవ్వరూ కొనరు. దాన్ని ఎలాగోలా ఎవరికైనా అంటగట్టినా ఎవరూ పట్టించుకోరు. దీంతో హీరో చాలా నిరుత్సాహపడతాడు. అలాంటి టైంలో సుహాస్ కి మామయ్య వరస అయ్యే ఓ వ్యక్తి ఇంట్లో పెళ్ళికి ఫ్యామిలీతో సహా వెళ్తాడు. అక్కడ సుహాస్ మామయ్య.. సుహాస్ పెద్ద రైటర్ అని, తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ముందు నుంచి సుహాస్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చూపిస్తాడు, దీంతో సుహాస్ మామయ్య వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావడంతో సుహాస్ పేరెంట్స్ కూడా పెళ్ళికి ఒప్పుకుంటారు. అంతలో హీరోయిన్(సుహాస్ మరదలు) వచ్చి తాను చదివిన బుక్ చూపించి తన రైటింగ్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాను అంటుంది. ఆ బుక్ చూసి హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే ఎవరో ఆ బుక్ రాసి తన పేరు, ఫొటోతో పబ్లిష్ చేస్తారు. అలాగే తన పేరు మీద ఓ బ్లాగ్ కూడా నడుపుతూ కథలు రాస్తారు. ఇందంతా తెలుసుకొని సుహాస్ షాక్ అవుతాడు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు అతనికి అనుకూలంగా మారుతుండటంతో మొదట తప్పు అనిపించినా ఆ తర్వాత ఆ బుక్ రైటర్ తానే అని చెప్పుకొని తిరుగుతూ కాబోయే భార్యతో ప్రేమాయణం నడిపిస్తాడు.

ఇంతలో తన పేరు మీద రాస్తున్న బ్లాగ్ ఆగిపోవడం, వాళ్ళ మామయ్య సెకండ్ బుక్ రిలీజ్ రోజే నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పడంతో ఎక్కడ తన పెళ్లి ఆగిపోతుందో అని భయపడటం మొదలుపెడతాడు. ముందు హీరోయిన్ కి నిజం చెప్పేసి ఆ బుక్ ఎవరు రాశారో వెతకడం మొదలుపెడతాడు. హీరోయిన్ కూడా అర్ధం చేసుకొని సుహాస్ కి సహాయం చేస్తుంది. ఇక అక్కడ్నుంచి ఆ బుక్ ఎవరు కనిపెట్టారు? సుహాస్ ఇంకో బుక్ రాశాడా? సుహాస్ నిశ్చితార్థం జరిగిందా అనేది సాగుతుంది. ఈ కథ తెరపై చూడాల్సిందే..

 

రైటర్ పద్మభూషణ్ మొదటి హాఫ్ అంతా కామెడీతో సాగినా రెండో సగం మాత్రం ఎమోషనల్ గా సాగుతుంది. అయితే సినిమాలో ఉండేది ఒకేఒక ట్విస్ట్ కానీ ఆ ట్విస్ట్ ని సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు కనుక్కోగలరు. దీంతో ఆ ట్విస్ట్ పెద్దగా ఉపయోగపడదు. అలాగే దర్శకుడు సమాజంలో ఉన్న ఓ పాతకాలం సమస్యని ప్రశ్నిస్తాడు. అయితే అది ఇప్పటి జనరేషన్ కి తగినట్టు ప్రశ్నిస్తే సినిమాకి ప్లస్ అవ్వదని అర్ధం చేసుకొని అమ్మ సెంటిమెంట్ ని జోడించాడు. దీంతో ఆ సమస్య ఇప్పుడు అంతగా లేకపోయినా అమ్మ సెంటిమెంట్ ని జోడించడంతో సినిమాకి ప్లస్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి అమ్మ సెంటిమెంట్ ని జోడించి హిట్ కొట్టాడు దర్శకుడు అని చెప్పొచ్చు.

Balakrishna-Pawan Kalyan : బాలయ్య-పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పొలిటికల్ ఎపిసోడ్.. రిలీజ్ తర్వాత ఏపీలో రచ్చ రచ్చే..

సినిమాలో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇక అమ్మగా రోహిణి, నాన్నగా ఆశిష్ విద్యార్ధి చాలా బాగా నటించారు. హీరోయిన్ టీనా శిల్పారాజ్ తన అందంతో క్యూట్ గా ప్రేక్షకులని మెప్పించింది. ఇంకో ముఖ్య పాత్ర గౌరి ప్రియా కూడా ప్రేక్షకులని మెప్పించింది. సినిమా మొత్తం చాలా వరకు విజయవాడలోనే తీశారు. దీంతో విజయవాడ ప్రజలు సినిమాకి మరింత కనెక్ట్ అవుతారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారు. మొత్తంగా రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధిస్తుంది. ఇక కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఈ సినిమాకి. ఇప్పటికే రెండు రోజుల్లోనే ఈ సినిమా 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి మరింత దూసుకుపోతుంది.