Satyadev : గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. మూడు లవ్ స్టోరీలు.. తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. గుర్తుండిపోద్ది..

Kaburulu

Kaburulu Desk

December 3, 2022 | 06:08 PM

Satyadev : గుర్తుందా శీతాకాలం ట్రైలర్.. మూడు లవ్ స్టోరీలు.. తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. గుర్తుండిపోద్ది..

Gurtundaa Seetakalam Trailer :  సత్యదేవ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గుర్తుందా శీతాకాలం. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది ఇది. ఈ సినిమాకు నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అనేసాక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

తాజాగా గుర్తుందా శీతాకాలం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో మూడు ప్రేమ కథలు ఉండనున్నాయి. సత్యదేవ్ చిన్నప్పుడు, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు. ప్రెజెంట్ లో ఒకటి. ఒక అమ్మాయిని ప్రేమించి విడిపోయి అనంతరం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయినా తర్వాత గతంలో వదిలేసిన అమ్మాయి మళ్ళీ వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అనేది తెర మీద చూడాల్సిందే.

Rajamouli : రాజమౌళికి ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు..

మొదటి సారి సత్యదేవ్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమకథలు బాగానే నడిపాడు. ఇక తమన్నాతో రొమాన్స్ కూడా ఎక్కువే ఉంది. సినిమా మొత్తం ఎక్కువగా ఊటీ లాంటి ప్రదేశాల్లో షూట్ చేసినట్టు ఉన్నారు. ఇప్పటివరకు సత్యదేవ్ చేసిన క్యారెక్టర్స్ కాకుండా మొదటి సారి లవర్ బాయ్ గా వస్తుండటంతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.