18 Pages Review : ఫోన్స్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి.. 18 పేజెస్ రివ్యూ..

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 09:24 PM

18 Pages Review : ఫోన్స్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి.. 18 పేజెస్ రివ్యూ..

18 Pages Review :  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మళ్ళీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా 18 పేజెస్ సినిమాతో వచ్చారు. డిసెంబర్ 23న నేడు ఈ సినిమా రిలీజ్ అయింది. దీనికి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిపి ఈ సినిమాని నిర్మించారు.

ట్రైలర్, పాటలతో ముందునుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ కూడా వీరలెవల్లో చేశారు. కథ విషయానికొస్తే హీరో ఒక యాప్ డెవలపర్ ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉండగా ఆ అమ్మాయి వేరే అబ్బాయితో కలిసి హీరోని చీట్ చేయడంతో ఓపెనింగ్ బ్రేకప్ కథతో సినిమా స్టార్ట్ అవుతుంది. బ్రేకప్ పాటలో హీరోకి ఒక డైరీ దొరుకుతుంది. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు ఈ డైరీ చదువుతూ అందులో హీరోయిన్ రాసిన దానికి కనెక్ట్ అవుతాడు.

రెండు సంవత్సరాల క్రితం రాసిన బుక్ కి కనెక్ట్ అయి ఆ బుక్ లో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ బుక్ మధ్యలో 18 పేజీలతో ఆగిపోవడంతో తర్వాత ఏమైంది అని హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాక షాకింగ్ నిజాలు, ట్విస్ట్ లు బయటకి వస్తాయి. దీంతో హీరో షాక్ అవుతాడు. మరి చివరకి హీరోయిన్ ని హీరో కలిశాడా లేదా అన్నదే కథ.

కథ సింపుల్ లైన్. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండానే ప్రేమలో పడి వాళ్ళ కోసం వెతకడం అనేది చాలా సినిమాల్లో చూసాం గతంలో. కానీ ఈ సినిమా కథనం కొత్తగా ఉంది. మొదటి హాఫ్ అంతా ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించారు. ఇంటర్వెల్ లో ట్విస్ట్ లు ఇచ్చి సెకండ్ హాఫ్ లో కథని రసవత్తరంగా నడిపించాడు. మధ్యమధ్యలో ఆడియన్స్ కొన్ని ట్విస్ట్ లని అర్ధం చేసుకోగలరు. క్లైమాక్స్ లో కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉండటంతో అప్పటిదాకా బాగా నడిచిన స్టోరీ క్లైమాక్స్ లో బలంగా ఉండదు. కానీ చివర్లో మళ్ళీ ఒక ఎమోషనల్ టచ్ తో కథని పూర్తి చేశారు.

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్ కి కలిపి కేవలం క్లైమాక్స్ షాట్ ఒక్కటే ఉండటం విశేషం. వీరి మధ్య మాటలు, కలయికలు ఉండకపోవడం విశేషం. సినిమా మొత్తాన్ని అనుపమ, నిఖిల్ తమ భుజాల మీద మోశారు అని చెప్పొచ్చు. వీరిద్దరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అనుపమ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మిగిలిన వాళ్ళు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎమోషనల్ గా టచ్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. గోపి సుందర్ మ్యూజిక్, BGM అదరగొట్టాడు. మొత్తంగా క్లైమాక్స్ లో కొద్దిసేపు ఇబ్బందిపెట్టినా సినిమా అంతా చాలా బాగుంది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్స్ పక్కన పెట్టి సమాజంలో మనుషులతో ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పాడు సినిమా ద్వారా.