Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్?

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 05:55 PM

Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కలయికలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా సక్సెస్ తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడం మరియు ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తుంది.

Ram Charan : శంకర్ తరువాత కన్నడ దర్శకుడితో చరణ్ మూవీ?

అదేంటంటే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ కూడా నటించబోతున్నాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు అని సమాచారం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ వంటి భారీ తారాగణాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శంకర్. ఇప్పుడు ఇది కూడా నిజమైతే మూవీ రేంజ్ ఇంకొంచెం పెరగనుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.