Mangli : నాపై ఎలాంటి రాళ్ళ దాడి జరగలేదు.. ఇదంతా కుట్ర.. మంగ్లీ అధికారిక లేఖ..

బళ్లారిలో ఓ ఈవెంట్ లో పాల్గొని వస్తుండగా ఈవెంట్ లో మంగ్లీ కన్నడ మాట్లాడలేదని, అడిగినా కూడా మాట్లాడలేదని కొంతమంది కన్నడ యువకులు మంగ్లీ కారు మీద దాడి చేశారని వార్తలు వచ్చాయి.................

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 09:56 AM

Mangli : నాపై ఎలాంటి రాళ్ళ దాడి జరగలేదు.. ఇదంతా కుట్ర.. మంగ్లీ అధికారిక లేఖ..

Mangli :  జానపద గీతాలు, మాస్ బీట్ సాంగ్స్ తో తెలుగులో పాపులర్ అయింది సింగర్ మంగ్లీ. తెలుగులో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది మంగ్లీ. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. గత కొన్ని రోజులుగా మంగ్లీకి కన్నడలో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో కన్నడలో కూడా బిజీ అయింది ఈ ఫోక్ సింగర్.

తాజాగా కర్ణాటకలోని బళ్లారిలో ఓ ఈవెంట్ లో పాల్గొని వస్తుండగా ఈవెంట్ లో మంగ్లీ కన్నడ మాట్లాడలేదని, అడిగినా కూడా మాట్లాడలేదని కొంతమంది కన్నడ యువకులు మంగ్లీ కారు మీద దాడి చేశారని వార్తలు వచ్చాయి. కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మంగ్లీ కారుపై రాళ్ళ దాడి జరిగిందనే వార్త వైరల్ అయింది. అయితే దీనిపై మంగ్లీ స్పందిస్తూ ఓ అధికారిక లేఖని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samantha : ఎట్టకేలకు షూటింగ్స్ మొదలుపెట్టిన సమంత.. హెల్త్ ఓకేనా??

ఈ లేఖలో.. బళ్లారిలో నాపై దాడి జరిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు అబద్దం. నేను ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. కన్నడ ప్రజలు నాకు మంచి స్వాగతం పలికారు. అక్కడి అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు నన్ను బాగా చూసుకున్నారు. నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ వార్తలన్నీ అవాస్తవం. నా ప్రతిష్టని దెబ్బతీయడానికే కొంతమంది ఇదంతా చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను అని మంగ్లీ తెలిపింది.