Koratala Siva : NTR30 సక్సెస్ కావాలని శ్రీవారిని మొక్కుకున్న కొరటాల..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న రెండో చిత్రం 'NTR30'. ఈ సినిమా అనౌన్స్‌తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకొంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:01 PM

Koratala Siva : NTR30 సక్సెస్ కావాలని శ్రీవారిని మొక్కుకున్న కొరటాల..

Koratala Siva : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న రెండో చిత్రం ‘NTR30’. ఈ సినిమా అనౌన్స్‌తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకొంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. అయితే ఈ మూవీ ప్రకటించి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నా ఇంకా షూటింగ్ కి వెళ్ళలేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డేట్ అండ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి అభిమానాలను ఖుషి చేశారు మేకర్స్.

NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల..

ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “వచ్చే నెల కచ్చితంగా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న సినిమా రిలీజ్ అవుతుంది” అంటూ తెలియజేశాడు. కొరటాల మునపటి సినిమా ప్లాప్‌గా నిలవడం, ఎన్టీఆర్‌కి రాజమౌళి తరవాత సినిమా గండం ఉండడంతో.. ఈ చిత్రంతో ఎలైనా సరే హిట్టు కొట్టాలని చూస్తున్నారు వీరిద్దరూ.

దాదాపు 4 నెలలు పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న మూవీ టీం పక్కా ప్రణాళికతో సెట్స్ పైకి వెళుతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ గా సాబు సిరిల్ పని చేస్తున్నారు.