RRR : మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న కీరవాణి..

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్'కి పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. ఈ అవార్డ్స్ విన్నర్ లిస్ట్ ని గత ఏడాది డిసెంబర్ లోనే జ్యూరీ అనౌన్స్ చేసింది. ఈ అవార్డ్స్ లో కూడా ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని గెలుచుకున్నాడు.

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 09:52 AM

RRR : మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్న కీరవాణి..

RRR :

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్.. ఈ అవార్డుని సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుల తరువాత గోల్డెన్ గ్లోబ్ ప్రతిష్టాత్మక పురస్కారం కావడంతో మూవీ టీంకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ నామినేషన్ లో స్థానం దక్కించుకున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’కి పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది.

RRR : ఆస్కార్‌కి ‘RRR’ని భారత్ ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం పై స్పందించిన ఎన్టీఆర్..

ఈ అవార్డ్స్ విన్నర్ లిస్ట్ ని గత ఏడాది డిసెంబర్ లోనే జ్యూరీ అనౌన్స్ చేసింది. ఈ అవార్డ్స్ లో కూడా ఎం ఎం కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని గెలుచుకున్నాడు. ఈ అవార్డుల పురస్కార వేడుక ఇవాళ లాస్ ఏంజెల్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరయిన కీరవాణి ఆ ప్రెస్టీజియస్ అవార్డుని అందుకున్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ RRR టీం ట్విట్టర్ ద్వారా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెలియజేసింది. మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకోవడంతో కీరవాణికి అభినందనలు తెలియజేస్తున్నారు నెటిజెన్లు.

కాగా ఒక ఇండియన్ సాంగ్ కి ఈ రేంజ్ లో పాపులారిటీ రావడం ఇదే మొదటిసారి. నిజం చెప్పాలి అంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఇంత దగ్గర అవ్వడానికి కారణం ‘నాటు నాటు’ సాంగ్. ఈ విషయాన్ని ఇటీవల రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట ఆస్కార్ నామినేషన్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఆస్కార్ కూడా గెలుచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు హాలీవుడ్ ప్రతినిథులు. మరి ‘నాటు నాటు’ ఆస్కార్ ని కూడా గెలుచుకుంటుందా? లేదా? అనేది చూడాలి.