Haripriya : KGF నటుడిని పెళ్లి చేసుకున్న నాని హీరోయిన్..

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ ఇటీవల కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకోగా తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న వివాహం చేసుకున్నారు. మైసూరులో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య................

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 02:32 PM

Haripriya : KGF నటుడిని పెళ్లి చేసుకున్న నాని హీరోయిన్..

Haripriya :  హీరోయిన్ హరిప్రియ కన్నడలో సినీ అరంగ్రేటం చేసి కన్నడలో సినిమాలు చేస్తూ తెలుగులో తకిట తకిట సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన పిల్ల జమిందార్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌, ఈ వర్షం సాక్షిగా, జైసింహా..లాంటి పలు సినిమాల్లో నటించింది హరిప్రియ. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించినా కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇటీవల కొన్ని నెలల క్రితం హరిప్రియ కన్నడ నటుడు వశిష్ట సింహని నిశ్చితార్థం చేసుకుంది. కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీగా ఉన్నాడు వశిష్ట సింహ. KGF సినిమాతో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. వశిష్ట తెలుగులో కూడా నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్‌.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. వశిష్ట, హరిప్రియ కలిసి కన్నడలో ఓ సినిమాలో నటించగా అప్పట్నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అనంతరం అది ప్రేమగా మారింది.

Tarakaratna : నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన నటుడు తారకరత్న..

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ ఇటీవల కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకోగా తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న వివాహం చేసుకున్నారు. మైసూరులో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు విచ్చేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిప్రియ, వశిష్ట సింహ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.