Ishaan Khattar : లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో

Kaburulu

Kaburulu Desk

September 10, 2022 | 01:41 PM

Ishaan Khattar : లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో

Ishaan Khattar :  బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడటం, విడిపోవడం సర్వ సాధారణం. ఇటీవల లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది బాలీవుడ్ భామ అనన్య పాండే. నార్త్ తో పాటు సౌత్ లో కూడా అభిమానులని సంపాదించుకుంటుంది అనన్య. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కజిన్, హీరో ఇషాన్ ఖట్టర్ తో అనన్య పాండే కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. బాలీవుడ్ అంతా వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలుసు. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే చాలా సార్లు బాలీవుడ్ పార్టీలలో, ముంబైలలో కలిసి తిరుగుతూ మీడియా కంట పడ్డారు.

అయితే కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇషాన్ కానీ, అనన్య కానీ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఇషాన్ ఖట్టర్ కోఫీ విత్ కరణ్ షో కి వచ్చాడు. ఈ షోకి కత్రినా కైఫ్, సిద్దాంత్ చతుర్వేదిలతో కలిసి వచ్చాడు. కరణ్ జోహార్ తన షోకి వచ్చిన వాళ్ళని కచ్చితంగా పర్సనల్ ప్రశ్నలు అడుగుతాడని తెలిసిందే.

Samantha : యశోద సినిమాకి సమంత అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందా??

ఈ నేపథ్యంలో ఇషాన్ ని ఇటీవల అనన్యతో విడిపోయావు కదా అని డైరెక్ట్ గా అడిగేశాడు కరణ్ జోహార్. దీనికి ఇషాన్ సమాధానమిస్తూ.. అవును ప్రస్తుతం నేను సింగిల్. కానీ అనన్య నాకు మంచి స్నేహితురాలు. నేను కలిసిన వాళ్ళల్లో అనన్య చాలా స్వీట్” అని చెప్పాడు. దీంతో వీళ్ళిద్దరూ నిజంగానే విడిపోయారని క్లారిటీ వచ్చింది అందరికి. మరి దీనిపై అనన్య ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.