Salaar : సలార్‌కి సీక్వెల్ ఉండబోతుందా?

Kaburulu

Kaburulu Desk

December 24, 2022 | 06:10 PM

Salaar : సలార్‌కి సీక్వెల్ ఉండబోతుందా?

Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజిఎఫ్ చిత్రాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఇండియా వైడ్ ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. కేజిఎఫ్ ఫ్రాంచైజ్ నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్.. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్ కి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేసిన ఆహా..

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. జనవరి ఎండింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వెళ్లనున్నారు. ఆ పనులు మరో ఆరు నెలలు పాటు జరగనున్నాయి అంటా. అయితే ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చూసిన మేకర్స్ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చూసి సీక్వెల్ తీస్తే బాగుంటది అనే ఆలోచన వచ్చింది. ఆ సీక్వెల్ గురించి ఆలోచిస్తున్నాము, కానీ కచ్చితంగా ఉంటది అని చెప్పలేము” అని వెల్లడించాడు. మరి చూడాలి ఏమి జరుగుతుందా అనేది. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే, మలయాళ నటుడు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.