Saniya Iyappan : మీద చెయ్యేసిన అభిమాని.. చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్..

Kaburulu

Kaburulu Desk

September 30, 2022 | 02:08 AM

Saniya Iyappan : మీద చెయ్యేసిన అభిమాని.. చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్..

Saniya Iyappan :  ప్రముఖ మలయాళం హీరోయిన్ సానియా అయ్యప్పన్ త్వరలో సాటర్ డే నైట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సానియా. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. హీరోయిన్ వస్తుందని తెలియడంతో భారీగా అభిమానులు, ప్రేక్షకులు మాల్ కి విచ్చేశారు. ఈ ప్రమోషన్స్ లో సానియా తన కో ఆర్టిస్ట్ గ్రేస్ ఆంటోనితో కలిసి పాల్గొంది.

అయితే ప్రమోషన్స్ అయిపోయాక మాల్ నుంచి బయటకి వస్తున్న సమయంలో అభిమానులు వీరితో ఫోటోల కోసం ఎగబడ్డారు. బాడీ గార్డ్స్ ఉన్నా వారిని ఆపలేకపోయారు. ఈ సమయంలో ఓ వ్యక్తి గ్రేస్ ఆంటోని మీద అసభ్యంగా చేతులు వేశాడు. వెనకాలే ఉన్న సానియా ఇది గమనించి అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Asha Parekh : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..

సానియా ఓ వ్యక్తిని కొట్టిన వీడియో వైరల్ గా మారడంతో దీనిపై సానియా, గ్రేస్ ఆంటోనిలు తమ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ”ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాల్ కి వెళ్లి బయటకి వస్తున్నప్పుడు కొంతమంది అభిమానులు హద్దు మీరి మా మీద అసభ్యంగా చేతులు వేశారు. బాడీ గార్డ్స్ ఉన్నా వారిని ఆపలేకపోయారు. అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. ఇలాంటి పరిస్థితులు ఏ మహిళకి రాకూడదు. ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని సానియా, గ్రేస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.