SSMB28 : మహేష్ బాబుకి అక్కగా సింగర్ సునీత?

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 03:20 PM

SSMB28 : మహేష్ బాబుకి అక్కగా సింగర్ సునీత?

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘SSMB28’. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు మరెంత పెంచేసింది. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది.

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

త్రివిక్రమ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ లేడీ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. సినిమా కథ కూడా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. సరిగా అలంటి పాత్రే SSMB28లో మహేష్ కి అక్క క్యారెక్టర్ అని తెలుస్తుంది. దీంతో దర్శకుడు త్రివిక్రమ్ ఆ పాత్ర కోసం.. సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ‘సునీత’ని సంప్రదించాడట. ఆమెకు కథ కూడా వినిపించినట్లు తెలుస్తుంది. అయితే ఆమె ఓకే చెప్పిందా? లేదా? అనేది మాత్రం తెలియదు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ ‘పూజ హెగ్దే’ నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా భీమ్లా నాయక్ ఫేమ్ ‘సంయుక్త మీనన్’ నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, తరువాతి షెడ్యూల్ కి సిద్దమవుతుంది. ఈ షెడ్యూల్ లో పూజ, మహేష్ పై లవ్ సీన్స్ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.