Sai Pallavi : బాలీవుడ్ హీరోకి జోడిగా సాయి పల్లవి?

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 10:58 AM

Sai Pallavi : బాలీవుడ్ హీరోకి జోడిగా సాయి పల్లవి?

Sai Pallavi : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. సౌత్ లో ఈ హీరోయిన్ తో సినిమాలు చేయాలనీ ఎంతోమంది హీరోలు, నిర్మాతలు కోరుకుంటుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఎటువంటి ఎక్సపోసింగ్ లేకుండా ఇతర హీరోయిన్లకు బిన్నంగా ముందుకు వెళుతుంటుంది.

Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్?

తాజాగా ఈ అందాల భామకి బాలీవుడ్ నుంచి ఆఫర్ అందిందట. స్టార్ హీరో రన్‌బీర్ కపూర్.. ‘శ్రీ రాముడు’ పాత్రలో కనిపిస్తూ ఒక సినిమా తెరకెక్కబోతుంది. ముందుగా ఈ చిత్రంలో సీత పాత్ర కోసం దీపికా పడుకోణె, కరీనా కపూర్ పేరులు వినిపించాయి. తాజాగా నిర్మాతలు ఈ పాత్ర కోసం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని సంప్రదించారని తెలుస్తుంది.

సాయి పల్లవి కూడా ఈ సినిమాకు ఓకే చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అని తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఇటీవల సాయి పల్లవి అసలు సినిమాలకు గుడ్ బై చెప్పేసి, తన చదువుకున్న వైద్య వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపించాయి.