Anchor Vrashini : వర్షిణి పెళ్లి చేసుకోబోతుందా?? ఆ లక్కీ బాయ్ ఎవరో??

Kaburulu

Kaburulu Desk

October 2, 2022 | 02:50 AM

Anchor Vrashini :  వర్షిణి పెళ్లి చేసుకోబోతుందా?? ఆ లక్కీ బాయ్ ఎవరో??

Anchor Vrashini :  షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి వచ్చి యాంకర్ గా, పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి పేరే తెచ్చుకుంది వర్షిణి. అందంగా ఉన్నా, సోషల్ మీడియాలో ఫొటోలతో అందాలు ఆరబోసినా సినిమా అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రావట్లేదు. దీంతో బుల్లితెరపైనే అప్పుడప్పుడు కొన్ని షోలలో కనిపిస్తుంది.

అవకాశాలు తగ్గినా తన హాట్ హాట్ ఫోటోషూట్స్ మాత్రం ఆపట్లేదు. అందరు రెచ్చిపోయి మోడ్రన్ డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేస్తే వర్షిణి మాత్రం ట్రెడిషినల్ డ్రెస్సుల్లో కూడా అదిరిపోయేలా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం వర్షిణి గురించి టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

Chiranjeevi : ఆ బాధ ఉంది.. డైరెక్టర్ చెప్పిందే చేశాం.. ఆచార్య ఫలితంపై మరోసారి స్పందించిన చిరంజీవి..

సినిమా అవకాశాలు కూడా ఎంతగా ట్రై చేసినా రాకపోవడంతో పెళ్ళికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. వాళ్ళ చుట్టాల్లోనే ఒక అబ్బాయిని త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు, ఇప్పటికే మాట్లాడుకోవడం కూడా అయిపోయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వర్షిణి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఇది నిజమేనా? నిజమే అయితే వర్షిణిని చేసుకోబోయే ఆ లక్కీ బాయ్ ఎవరో అంటూ ఆలోచిస్తున్నారు.