Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ సినిమా చేస్తా.. చాలా మంది అడుగుతున్నారు..

తాజాగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో మరో సినిమాపై మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయట్లేదు. కానీ అతనితో కలిసి మళ్ళీ సినిమా చేయమని చాలా మంది........

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 01:23 PM

Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ సినిమా చేస్తా.. చాలా మంది అడుగుతున్నారు..

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ జనవరిలోనే రష్మిక నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. దీంతో రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండతో సినిమా గురించి మాట్లాడింది.

రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. గీత గోవిందం సినిమా మంచి విజయం సాధించగా డియర్ కామ్రేడ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు ప్రేక్షకులని. కానీ ఈ రెండు సినిమాలతో వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ పెయిర్ కి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, కలిసి మాల్దీవ్స్ కి వెళ్లారని అనేక వార్తలు వచ్చాయి. వార్తలకి తగ్గట్టే వీళ్ళు కూడా ముంబైలో పర్సనల్ గా చెట్టాపట్టాలేసుకొని మీడియాకి చిక్కారు. దీంతో వీరిద్దరి గురించి అనేక వార్తలు, గాసిప్స్ వచ్చాయి. ఎన్ని వార్తలు వస్తున్నా వీటిపై రష్మిక, విజయ్ మాత్రం స్పందించలేదు. ఒకవేళ ఎవరన్నా అడిగినా మంచి ఫ్రెండ్ అని తప్పించుకుంటున్నారు.

Peddada Murthy : వరుస విషాదాలు.. టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత కన్నుమూత..

తాజాగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో మరో సినిమాపై మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయట్లేదు. కానీ అతనితో కలిసి మళ్ళీ సినిమా చేయమని చాలా మంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. నాకు కూడా అతనితో కలిసి పనిచేయడమంటే చాలా ఇష్టం. కానీ మా ఇద్దరికీ సరిపోయే కథ రావాలి, దానికోసమే చూస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కచ్చితంగా విజయ్ దేవరకొండతో మళ్ళీ సినిమా చేస్తాను అని తెలిపింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, త్వరలోనే వీళ్లిద్దరు కలిసి మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నారు.