Ram Charan : శంకర్ తరువాత కన్నడ దర్శకుడితో చరణ్ మూవీ?

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 05:27 PM

Ram Charan : శంకర్ తరువాత కన్నడ దర్శకుడితో చరణ్ మూవీ?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్‌లపై పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Pawan Kalyan : వారసుడు కోసం కదిలొస్తున్న వకీల్ సాబ్..

అయితే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే 2017లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ముఫ్తి’ని డైరెక్ట్ చేసిన దర్శకుడు ‘నర్తన్’తో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటా. ఈ దర్శకుడు చరణ్ కి కథ కూడా వినిపించాడని, స్టోరీ లైన్ కూడా నచ్చడంతో చరణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా ఈ మెగా హీరో ఇటీవల ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాకి సంతకం చేసిన సంగతి తెలిసిందే. మరి RC15 తరువాత రామ్ చరణ్ ఏ సినిమాని మొదలు పెడతాడు అనేది మాత్రం క్లారిటీ లేదు.