Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 07:46 PM

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

Ram Charan : ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయగా, ఇవాళ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు.

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న రామ్ చరణ్ కూడా ఈ షోలో భాగం అయ్యినట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య మెగాపవర్ స్టార్ కి కాల్ చేసి ప్రభాస్ తో పాటు అందర్నీ ఆశ్చర్యపరిచాడట.

ఈ ఫోన్ కాల్ లో రామ్ చరణ్, ప్రభాస్ ని పలు ఆశక్తికర ప్రశ్నలు అడిగాడు అంటా. ప్రభాస్ లేటెస్ట్ మూవీ మరియు డేటింగ్ లైఫ్ గురించి చరణ్ అడిగాడు అని తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టడం ఖాయం. కాగా ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30, 31 తేదీలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.