Pushpa 2 : పుష్ప-2లో రామ్‌చరణ్ అతిధి పాత్ర?

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 12:11 PM

Pushpa 2 : పుష్ప-2లో రామ్‌చరణ్ అతిధి పాత్ర?

Pushpa 2 : దర్శకుడు సుకుమార్, స్టైలిష్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప ది రైస్’. ఒక రీజినల్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకొని ఇటీవలే రష్యాలో కూడా పుష్ప 1 చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ఇంతటి హిట్టుని అందుకున్న ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Pushpa 2 : దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం బాగోలేదు.. బన్నీ వాసు కామెంట్స్!

అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింటలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ సెకండ్ పార్ట్ లో.. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి.

ఇక గతంలో రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ‘పుష్ప ది రూల్’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలు కానున్నట్లు అల్లు అర్జున్ సన్నిహితుడు మరియు నిర్మాత బన్నీ వాసు ’18 పేజిస్’ ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక, తరువాతి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సింగపూర్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.