Ram Charan : అన్‌స్టాపబుల్‌కి రామ్‌చరణ్, కేటీఆర్ రాబోతున్నారా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ విత్ NBK'. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు ఫేమ్ అండ్ కాంట్రవర్సీ పర్సన్స్‌ని తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు బాలయ్య. తాజాగా ఈ షోకి మరో అదిరిపోయే గెస్ట్‌లను ఆహ్వానించే ఆలోచన చేస్తున్నారట ఆహా టీం.

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 09:16 PM

Ram Charan : అన్‌స్టాపబుల్‌కి రామ్‌చరణ్, కేటీఆర్ రాబోతున్నారా?

Ram Charan : బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’. ఈ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన ప్రజాధారణ లభిస్తుంది. దీంతో షో నిర్వాహుకులు కూడా వారి అంచనాలకు తగ్గకుండా అతిధులను తీసుకు వస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు ఫేమ్ అండ్ కాంట్రవర్సీ పర్సన్స్‌ని తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు బాలయ్య.

Ram Charan : సంక్రాంతికి RC15 టైటిల్ గ్లింప్స్ రానుందా?

తాజాగా ఈ షోకి మరో అదిరిపోయే గెస్ట్‌లను ఆహ్వానించే ఆలోచన చేస్తున్నారట ఆహా టీం. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌తో మాట్లాడిన బాలయ్య.. అన్‌స్టాపబుల్‌కి ఎప్పుడు వస్తావు అని ప్రశ్నించగా, మీరు పిలవడమే ఆలస్యం అంటూ చరణ్ కూడా ఒకే అనేశాడు. దీంతో రామ్‌చరణ్‌ని ఈ షోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్వాహుకులు. కాగా చరణ్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని కూడా తీసుకురానున్నారని తెలుస్తుంది.

చరణ్ అండ్ కేటీఆర్ మంచి స్నేహితులు కావడంతో ఆహా టీం ఈ కాంబినేషన్ సెట్ చేసే ఆలోచనలో ఉందట. వీరిద్దరి ఎపిసోడ్ ని ఈ సీజన్ లో కాకుండా వచ్చే సీజన్ మొదటి ఎపిసోడ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. కాగా ఈ సీజన్ చివరి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్‌ది కానుంది. ఈ ఎపిసోడ్ కోసం సినీ, రాజకీయ వర్గాల్లో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.