Puri Jagannadh : చిరుకి కథ వినిపించిన పూరి.. కానీ ఆ కథ చిరు కోసం కాదట!

లైగర్ సినిమా ప్లాప్ తో పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి హీరోలు అంతా సందేహిస్తుంటే చిరు మాత్రం సై అంటున్నాడు. ఈ క్రమంలోనే పూరి, చిరుకి కథ వినిపించాడట. కానీ ఆ కథ చిరంజీవి కోసం కాదు..

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 07:07 PM

Puri Jagannadh : చిరుకి కథ వినిపించిన పూరి.. కానీ ఆ కథ చిరు కోసం కాదట!

Puri Jagannadh : టాలీవుడ్ బెస్ట్ మాస్ డైరెక్టర్ ఎవరంటే మొదటిగా వినిపించే పేరు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఈ దర్శకుడికి హిట్టులు లేకపోవచ్చు. కానీ ఇండియన్ సినిమాలో ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ రాసే దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది పూరి మాత్రమే. పూరి డైరెక్షన్ లో పని చేశాకే మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి వారికీ ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో ఆల్రెడీ ఒప్పుకున్న ‘జనగణమన’ సినిమాని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

Bhola Shankar : భోళాశంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరంజీవి.

ఈ క్రమంలోనే ఇతర హీరోలు కూడా ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు సందేహిస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం పూరితో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. గాడ్ ఫాదర్ సమయంలో చిరంజీవే పూరీజగన్నాధ్ ని.. నాతో సినిమా ఎప్పుడు చేస్తావు అని అడగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఇటీవల చిరంజీవిని కలిసి పూరీజగన్నాధ్ ఒక కథ వినిపించాడు అని తెలుస్తుంది.

అయితే ఈ కథ చిరు కోసం కాదట. రామ్ చరణ్ కోసం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. లైగర్ తో పాన్ ఇండియాకి తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నాడు పూరి. కానీ సినిమా ప్లాప్ తో సీన్ అంతా రివర్స్ అయ్యింది. ప్రస్తుతం RRR సినిమాతో చరణ్ కి పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. దీంతో ఎక్కడ పోయింది అక్కడే వెతుకోవాలి అన్నట్లు. పాన్ ఇండియా స్టార్ చరణ్ తో సినిమా తీసి హిట్టు కొట్టే ఆలోచన తోనే చిరుకి కథ వినిపించాడు అని తెలుస్తుంది.

సినిమా కథ విషయంలో ముందు చిరుని ఒప్పిస్తే, చరణ్ అంగీకరించడం చాలా సులభమని పూరి చిరు నుండి ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తుంది. అయితే ఈ కథ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ లేదా ఇంకోటా అనేది తెలియదు. కాగా ఇండస్ట్రీకి రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసింది పూరినే. చిరుతతో మొదటి సినిమాకే రామ్ చరణ్ కి మాస్ ఇమేజ్ ని సొంతం చేసిన పూరి కోసం చిరు ఓకే చెబుతాడా లేదా అనేది తెలియాలి.