Prabhas : బాలయ్య కోసం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయించిన ప్రభాస్..

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 09:10 PM

Prabhas : బాలయ్య కోసం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయించిన ప్రభాస్..

Prabhas : నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరుకానున్నాడు. ప్రభాస్ తో పాటు అతని స్నేహితుడు గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొనున్నాడు. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తీ చేసుకోగా, అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిని.

Ram Charan : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్?

కాగా ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, బాలయ్యకి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడట. డార్లింగ్ ఆతిధ్యం గురించి టాలీవుడ్ అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ప్రభాస్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు బాలయ్య కోసం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయించి తీసుకు రావడమే కాకుండా అన్‌స్టాపబుల్ టీమ్ మొత్తానికి కూడా విందుని ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విందులో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై తో గ్రాండ్ గా ఏర్పాటు చేశారని సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 30 లేదా 31 తేదీల్లో ప్రసారం కానుంది. మరి ఈ ఎపిసోడ్ తో బాలయ్య ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.