Prabhas : సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా?

Kaburulu

Kaburulu Desk

December 26, 2022 | 07:55 PM

Prabhas : సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా?

Prabhas : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఈ దర్శకుడి తదుపరి సినిమాలపై ఆసక్తిని చూపుతున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే ఈ దర్శకుడు తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతున్నట్లు తెలిసింది. ఆ సినిమాకి సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ సీన్ కూడా RRR షూటింగ్ సమయంలో పూర్తి చేసినట్లు రాజమౌళి వెల్లడించాడు.

Prabhas : మారుతీ సినిమాలో ప్రభాస్ లుక్ అదుర్స్.. ఫోటో లీక్!

ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక మూవీ చేయనున్నాడని తెలుస్తుంది. ఇటీవలే సుకుమార్ కథ కూడా వినిపించడం, ప్రభాస్ ఓకే చేసేయడం కూడా అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తికేయ-2 సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట. 2024లో ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది.

అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇది నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు.