Pooja Hegde : SSMB28 సినిమా నుంచి పూజ హెగ్దే అవుట్?

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 11:28 AM

Pooja Hegde : SSMB28 సినిమా నుంచి పూజ హెగ్దే అవుట్?

Pooja Hegde : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటది. అలాంటి కాంబినేషన్ లో ఒకటి ‘మహేష్ – త్రివిక్రమ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి ప్రజాధారణ పొందాయి. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మూవీ లాంచ్ కూడా పూజ కార్యక్రమాలతో చాలా గ్రాండ్ మొదలైనప్పటికీ చిత్రీకరణ మాత్రం ముందుకు వెళ్లలేకపోతుంది.

Sai Pallavi : బాలీవుడ్ హీరోకి జోడిగా సాయి పల్లవి?

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ కి వెళ్ళడానికి మాత్రం ఇబ్బందులు పడుతుంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్దే కాలుకి గాయం అవ్వడంతో రెండో షెడ్యూల్ మొదలు కావడానికి ఆలస్యం అయ్యింది. ఆ తరువాత కృష్ణ మరణం వల్ల మహేష్ కూడా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు.

తాజాగా మళ్ళీ తిరిగి సెట్స్ కి వెళ్ళడానికి మూవీ టీమ్ సిద్ధమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్దే తప్పు కున్నట్లు సినీవర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహేష్ ఇంటిలో SSMB28 టీమ్ కి నమ్రతా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకి పూజ రాకపోవడంతో ఈ వార్తలు నిజమనేలా ఉన్నాయి. కాగా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.