Pawan Kalyan : సింగల్ షెడ్యూల్‌లో సినిమా కంప్లీట్ చేయబోతున్న పవన్, సుజిత్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ తో ఒక సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒకే షెడ్యూల్ లో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 07:28 PM

Pawan Kalyan : సింగల్ షెడ్యూల్‌లో సినిమా కంప్లీట్ చేయబోతున్న పవన్, సుజిత్?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను అయితే ప్రకటించేశాడు. కానీ ఆ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు పూర్తీ అవుతాయి అనేది ఎవరికి తెలియడం లేదు. ప్రస్తుతం పవన్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా లేటు అవుతూ వచ్చింది. దీంతో పవన్ ఎలాగైనా వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ మరో మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan : పవన్ ‘వినోదయ సిత్తం’ రీమేక్ జనవరిలో మొదలుకానుందా?

వాటిలో ఒకటి తమిళ రీమేక్ మూవీ ‘వినోదయ సిత్తం’, రెండు హరీష్ శంకర్ సినిమా, మరొకటి సుజిత్ మూవీ. కాగా సుజిత్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ ఈ మూవీ మొత్తాన్ని ఒక్క షెడ్యూల్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. దాదాపు నెల పాటు సాగే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మూవీలో నటించే అందరూ పాల్గొనున్నారు. అయితే మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో ఫైట్స్ అండ్ సాంగ్స్ ఉండవంటూ వార్తలు వస్తున్నాయి.

పవన్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఫైట్స్ అండ్ సాంగ్స్. అలాంటిది అవేవి లేకుండా మూవీ తీస్తే అభిమానులు అంగీకరిస్తారా? అయితే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు అని అర్ధమవుతుంది. గ్యాంగ్ స్టార్ అంటే ఫైట్స్ లేకుండా ఎలా ఉంటుంది అంటూ కొంతమంది అది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ఈ వార్తలు అన్నిటి గురించి క్లారిటీ రావాలంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాల్సిందే. ఈ మూవీని RRR నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.