Pawan Kalyan : పవన్ ‘వినోదయ సిత్తం’ రీమేక్ జనవరిలో మొదలుకానుందా?

Kaburulu

Kaburulu Desk

December 26, 2022 | 07:52 PM

Pawan Kalyan : పవన్ ‘వినోదయ సిత్తం’ రీమేక్ జనవరిలో మొదలుకానుందా?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది హరీష్ శంకర్, సుజిత్ దర్శకులతో మూవీలు అనౌన్స్ చేసి, సినిమాలు విషయంలో వేగం పెంచేశాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్ కి వెళ్లనున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు కంటే ముందు, పవన్ ఒక తమిళ రీమేక్ సినిమా పూర్తీ చేయడానికి సిద్దమవుతున్నాడు. 2021లో విడుదలైన ఫాంటసీ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘వినోదయ సిత్తం’ సినిమాలో పవన్ నటించబోతున్నాడు.

I like Pawan Kalyan but love CM Jagan.. Vishal!

ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్‌కి చెందిన హీరో యాక్సిడెంట్ లో చనిపోతాడు. చనిపోయిన ఆ హీరోని తీసుకు వెళ్ళడానికి ‘టైమ్’ అనే వ్యక్తి వస్తాడు.

అయితే తాను నెరవేర్చాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు ఇంకొంచెం సమయం ఇవ్వమని హీరో కోరడంతో, ఆ సమయాన్ని ఇస్తాడు టైమ్. ఆ సమయంలో ఏమి జరిగింది అనేది మిగతా సినిమా. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా సాయి ధరమ్ తేజ్, టైమ్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. అయితే పవన్ పాత్ర సినిమాలో కొంతవరుకే ఉంటుంది. గతంలో పవన్ ఈ తరహా పాత్ర ‘గోపాల గోపాల’ సినిమాలో చేశాడు.