Pawan Kalyan : వారసుడు కోసం కదిలొస్తున్న వకీల్ సాబ్..

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 04:54 PM

Pawan Kalyan : వారసుడు కోసం కదిలొస్తున్న వకీల్ సాబ్..

Pawan Kalyan : తెలుగు నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటిసారిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూ నిర్మిస్తున్న సినిమా ‘వారిసు’. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ అవుతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పాట లీక్ చేసిన చిరు..

అయితే ఈ సినిమా విడుదలపై టాలీవుడ్ పెద్ద రచ్చే జరిగింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దక్కకుండా, డబ్బింగ్ మూవీ వారసుడు కోసం దిల్ రాజు థియేటర్లు బ్లాక్ చేశాడు అంటూ ఫిల్మ్ కౌన్సిల్ లో వాదనలు వినిపించడంతో.. వారసుడు సినిమాపై ప్రేక్షకుల్లో ఆశక్తి పోయింది. దీంతో సినిమాపై మళ్ళీ క్రేజ్ ని సంపాదించుకోడానికి దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వేసాడట.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అతిధిగా తీసుకు వచ్చి, పవన్ అభిమానులను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే తెలుగులో వారసుడు సినిమా కలెక్షన్స్ కి పెద్ద ప్లస్ అవుతుంది అనే చెప్పాలి. అంతేకాదు సౌత్ లోని ఇద్దరి సూపర్ స్టార్స్ ని ఒకే స్టేజి మీద చూడడం కన్నుల పండుగలా ఉంటుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలి.