NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల..

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 06:03 PM

NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల..

NTR : ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ సూపర్ స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమా మొదలుపెట్టడంలో మాత్రం తడబడుతున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాలతో సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ కెమెరా ముందుకు వెళ్లకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది.

Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ!

కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలు కానున్నది అంటా. అయితే అంతకంటే ముందు.. కొరటాల శివ ఒక స్పెషల్ వీడియోని షూట్ చేసి సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నాడట. త్వరలోనే ఈ వీడియో గురించి వివరాలు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సినిమా అండర్ వాటర్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేందుకు గ్రాఫికల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కినున్నారు మేకర్స్. దీంతో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ హైదరాబాద్ శివారులో అదిరిపోయే సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ లేదా రష్మిక మందానని తీసుకోనున్నట్లు తెలుస్తుంది.