NTR30 : కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా..

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 03:18 PM

NTR30 : కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా..

NTR30 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈ పాపులారిటీని కాపాడుకునేందుకు తన తదుపరి ప్రాజెక్టులు కూడా అదే రేంజిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనకి ఇంతకుముందు అదిరిపోయే హిట్టుని అందించిన దర్శకుడు కొరటాల శివని నమ్ముకున్నాడు. NTR30గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికే చాలా రోజులు అయింది. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు.

Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

దీంతో ఈ సినిమాపై రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఈ సినిమా కరోనా నేపథ్యంలో రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు బయటపెట్టేలా ఈ కథ ఉండబోతుందట. అటువంటి కష్ట సమయంలో మెడికల్ మాఫియా చేస్తున్న దారుణాలను నిలదీసే సామాన్యుడు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సామాజిక స్పృహతో సినిమాలు తీసే కొరటాల ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఈ వార్తలు నిజమని ఎలా ఉన్నాయి.

కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ.. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ మరియు డిఓపి రత్నవేలుతో కలిసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో పాల్గొంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అదిరిపోయే పాటలతో పాటు సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నాడట. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా కోసం లోకేషన్లు వెతికే పనిలో పడింది చిత్ర యూనిట్.