Meenakshi Chaudhary : టిల్లు స్క్వేర్ సినిమాలోకి హిట్-2 భామ ఎంట్రీ?

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 12:00 PM

Meenakshi Chaudhary : టిల్లు స్క్వేర్ సినిమాలోకి హిట్-2 భామ ఎంట్రీ?

Meenakshi Chaudhary : ఒక చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న సినిమా ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Pooja Hegde : SSMB28 సినిమా నుంచి పూజ హెగ్దే అవుట్?

ఇక ఇంతటి హిట్టు అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్దమై ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ తో అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ సీక్వెల్ అనుకున్న దగ్గర నుండి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఈ సినిమా నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకొని, మల్లిక్ రామ్ ఫ్రేమ్ లోకి రాగా.. హీరోయిన్ల విషయంలో కూడా అదే జరిగింది.

మొదటిగా ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలని ఎంపిక చేయగా, ఆమె కొన్ని కారణాలు వల్ల తప్పుకుంది. ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమా నుంచి తప్పుకుంది. కాగా ఈ పాత్ర కోసం హిట్-2 సినిమాతో హిట్టు కొట్టిన ‘మీనాక్షి చౌదరి’ ఎంపిక అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ పాత్ర కోసం ‘మడోన్నా సెబాస్టియన్‌’ని కూడా ఎంపిక చేసినట్లు ఇటీవల గుసగుసలు వినిపించాయి.