Manchu Vishnu : డ్యాన్స్ చేస్తుంటే గాయం.. ఆ మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పిన మంచు విష్ణు..

Kaburulu

Kaburulu Desk

September 1, 2022 | 09:52 AM

Manchu Vishnu : డ్యాన్స్ చేస్తుంటే గాయం.. ఆ మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పిన మంచు విష్ణు..

Manchu Vishnu :  ‘మా’ ఎలక్షన్స్ లో పోటీ దగ్గర్నుంచి, ఆ తర్వాత ‘మా’ ఎలక్షన్స్ లో గెలిచి ‘మా’ ప్రెసిడెంట్ అవ్వడం.. వీటన్నిటితో సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాడు మంచి విష్ణు. ఇక ఆ తర్వాత కూడా తన కొత్త సినిమాల అప్డేట్లు, లేదా ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తూనే ఉన్నాడు విష్ణు.

ప్రస్తుతం మంచు విష్ణు ఓ కొత్త దర్శకుడితో జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. మొదటి నుంచి ఈ సినిమాపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు విష్ణు. అయితే తాజాగా మంచు విష్ణు ఈ సినిమా షూటింగ్ లో కాలికి గాయమైందంటూ ఓ పోస్ట్ చేశాడు.

మంచు విష్ణు తన కాలికి అయిన గాయాన్ని ఫోటో తీసి, దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. ”థ్యాంక్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. డ్యాన్స్ చేస్తూ ఇలా గాయం చేసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు” అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫోటో చూస్తే పెద్ద గాయంగా అనిపించకపోవడంతో, అది కూడా విష్ణు మొదటిసారి ఇలా డ్యాన్స్ చేస్తూ గాయం అయింది అని పెట్టడంతో నెటిజన్లకు మరోసారి విష్ణుని ట్రోల్ చేయడానికి అవకాశం దొరికింది. ఇలా చిన్న దెబ్బకే పోస్ట్ చేయడంతో ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.