Kamal Hasan : విజయ్ సినిమాలో కమల్ హాసన్.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్?

దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి ఇళయ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు అని తెలుస్తుంది.

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 07:05 PM

Kamal Hasan : విజయ్ సినిమాలో కమల్ హాసన్.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్?

Kamal Hasan : హిట్టు కోసం తహతహలాడుతున్న సమయంలో కమల్ హాసన్ కి ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా తమిళనాట ఉన్న రికార్డులు అన్ని బద్దలు కొట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ లోకనాయకుడు భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మణిరత్నం దర్శకత్వలో ఒక సినిమా చేయబోతున్నాడు. కాగా కమల్ హాసన్ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Balakrishna : అక్కినేని-తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలు.. వారసులు కౌంటర్లు!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి ఇళయ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు అని తెలుస్తుంది. విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ చేసినట్లు, ఈ సినిమాలో కమల్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాము అంటూ దర్శకుడు ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కమల్ ని ఈ సినిమాలో విజయ్ కి పరిచయం చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా దర్శకుడు త్రిష పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో త్రిష, విజయ్ కలిసి సూపర్ హిట్టు సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్నారు. కాగా ‘వరిసు’ సినిమా పనులు పూర్తి చేసుకున్న విజయ్ త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కించనున్నాడు. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.