Hari Hara Veera Mallu : పవన్ ‘వీరమల్లు’ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యిందా?

పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పోరాట యోధుడిగా కనిపిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెల కున్నాయి. కాగా ఈ సినిమా సమ్మర్ కి విడుదల అవుతుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే..

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 05:19 PM

Hari Hara Veera Mallu : పవన్ ‘వీరమల్లు’ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యిందా?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహరులు జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. 17వ శతాబ్దం కాలం నాటి కథ కావడం, మొఘలులు పాలిస్తున్న సమయం అవడంతో.. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ ఖర్చుతో సెట్ లు నిర్మిస్తున్నారు. సుమారు 150 – 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా.

Ali : పవన్ కళ్యాణ్‌ పై పోటీకి నేను సిద్ధం.. అలీ!

ఇక ఈ చిత్రంలో పవన్ మొదటిసారిగా పోరాట యోధుడిగా కనిపించబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెల కున్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, స్టంట్ స్టిల్స్ నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి బజ్ ని క్రియేట్ చేసిని. కాగా ఈ సినిమా సమ్మర్ కి విడుదల అవుతుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే వీరమల్లు ఆగమనం కొంత లేటు అవబోతుంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడవచ్చని అంతర్గత వర్గాలు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ద్వితీయార్థానికి పోస్ట్‌పోన్ అయ్యింది అంటున్నారు. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవలే మేకర్స్ భారీ ఫైట్ సీక్వెన్స్ ని పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి, పవన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా, నోరా ఫతేహి మొఘల్ రాణిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.