Nikhil : ఆ సినిమాకి సీక్వెల్ తీయకపోతే ముందు మా అమ్మ ఊరుకోదు..

Kaburulu

Kaburulu Desk

October 16, 2022 | 09:22 AM

Nikhil : ఆ సినిమాకి సీక్వెల్ తీయకపోతే ముందు మా అమ్మ ఊరుకోదు..

Nikhil :  హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ సినిమాకి సీక్వెల్ కార్తికేయ 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి దేశమంతటా భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ సినిమాపై, చిత్ర యూనిట్ పై అభినందనలు కురిపించారు.

ఇక ఈ సినిమాకి కూడా సీక్వెల్ గా కార్తికేయ 3 ఉండొచ్చని గతంలోనే ప్రకటించారు నిఖిల్, డైరెక్టర్ చందూ మొండేటి. పలువురు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి మరో సీక్వెల్ కావాలని కోరుకుంటున్నారు.

Unstoppable : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. యువ హీరోలతో రచ్చ చేసిన బాలయ్య..

తాజాగా నిఖిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 3 సినిమా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అభిమానుల సంగతేమో కానీ కార్తికేయ 3 తీయకపోతే మా అమ్మ ఊరుకోదు. రోజూ కార్తికేయకి మరో సీక్వెల్ ఉందా అని అడుగుతుంది. కచ్చితంగా కార్తికేయ సినిమాకి మరో సీక్వెల్ ఉంటుంది అని చెప్పి కార్తికేయ 3 మీద మరోసారి క్లారిటీ ఇచ్చాడు.