Balakrishna : బాలయ్యబాబు మొదటి యాడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బులతో ఏం చేశారో తెలిస్తే బాలయ్యని పొగడకుండా ఉండలేరు..

Kaburulu

Kaburulu Desk

October 29, 2022 | 08:43 AM

Balakrishna : బాలయ్యబాబు మొదటి యాడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బులతో ఏం చేశారో తెలిస్తే బాలయ్యని పొగడకుండా ఉండలేరు..

Balakrishna :  గత కొంతకాలంగా బాలయ్యబాబు మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షో కూడా సూపర్ హిట్ అయి ఇప్పుడు సీజన్ 2 కూడా మొదలైంది. ఇదే ఊపులో బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహ రెడ్డి టైటిల్ ని కూడా ప్రకటించారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా బాలకృష్ణ కెరీర్లో మొట్టమొదటి యాడ్ చేశారు. ఇటీవల సెలబ్రిటీలంతా యాడ్స్ చేసి కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది సంపాదించిన డబ్బులతో మంచి పనులు కూడా చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ తన మొదటి యాడ్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చేశారు. ఈ యాడ్ కూడా బాలయ్య రేంజ్ కి తగ్గట్టే చాలా బాగా పవర్ ఫుల్ గా తీశారు.

Ali : ఏపీ ప్రభుత్వంలో కమెడియన్ అలీకి కీలక పదవి..

ఇక ఈ యాడ్ కి బాలకృష్ణ దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. రెండు యాడ్స్ కి, ప్రమోషన్స్ కి కలిపి ఇంత అమౌంట్ ని తీసుకున్నట్టు సమాచారం. ఈ డబ్బులని బాలకృష్ణ తన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమాల్లోనే హీరోగా కాక బయట కూడా ఎంతోమంది క్యాన్సర్ పేషంట్లకి ఉచిత వైద్యం అందించి రియల్ హీరో అనిపించుకుంటున్నారు. బాలయ్య కెరీర్లో చేసిన మొదటి యాడ్ కి వచ్చిన రెమ్యునరేషన్ ని తన క్యాన్సర్ హాస్పిటల్ కి విరాళంగా ఇవ్వడంతో మరోసారి బాలయ్య బాబుని అంతా పొగుడుతున్నారు.