Dil Raju : తమిళ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు?

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 09:20 PM

Dil Raju : తమిళ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు?

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’. టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ, నిర్మాత దిల్ రాజు చుట్టూ వివాదం నడుస్తుంది.

Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్?

సంక్రాంతికి విడుదలవుతున్న తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య సినిమాలకు థియేటర్లు కేటాయించకుండా, వారిసు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారంటూ నిర్మాతల మండలిలో చర్చ మొదలైంది. కాగా ఇదే సినిమాతో పాటు దిల్ రాజు.. మరో తమిళ మూవీని కూడా డబ్ చేసి రిలీజ్ చేయడానికి ప్రయత్నించాడు.

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘తునివు’ని విడుదల చేయడానికి దిల్ రాజు ట్రై చేసినప్పటికీ, వారిసు వివాదంతో ఈ బడా నిర్మాత తన ఆలోచనని మార్చుకున్నాడట. దీంతో ఈ మూవీ దుబ్బింగ్ రైట్స్ ని కొత్త నిర్మాత దక్కించుకున్నాడు. అయితే ఆ కొత్త నిర్మాత వెనుక దిల్ రాజు ఉండి అజిత్ సినిమా హక్కులను దక్కించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.