Ali : అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు..

Kaburulu

Kaburulu Desk

October 31, 2022 | 08:48 AM

Ali : అలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు..

Ali :  కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. చాలా సార్లు పవన్ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. అలీ లేకపోతే నేను సినిమా చేయను అని కూడా చెప్పాడు. అలాంటి ఈ స్నేహితుల మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ కళ్యాణ్ జనసేనని కాదని అలీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంతేకాక పవన్ పై విమర్శలు కూడా చేశాడు.

ఆ సమయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అలీని బాగా ట్రోల్ చేశారు. అయినా అలీ మాత్రం వైసీపీలోనే ఉన్నారు. అప్పట్నుంచి వీరిద్దరం కలవడం మానేశారు. మాట్లాడుకోవడం కూడా లేదని సమాచారం. అలీ వైసీపీలో చేరిన తర్వాత ఒకే ఒక్కసారి ఏదో ఫంక్షన్ లో వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలుసుకోలేదు, కలిసి నటించలేదు.

ఇక అలీ.. అలీతో సరదాగా అనే షోతో ఓ ఛానల్ లో అలరిస్తారు. పలువురు ప్రముఖుల్ని తీసుకొచ్చి వారితో మాట్లాడతారు ఈ షోలో. అలీతో సరదాగాలో ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు వచ్చారు. అలీ, పవన్ కలిసి ఉన్నప్పుడు పవన్ కచ్చితంగా ఈ షోకి వస్తాడని అనుకున్నారు కానీ రాలేదు. ఇక వీరిద్దరూ దూరమయ్యాక ఆ ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు.

Urvasivo Rakshasivo : ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్.. ఈ సారి అల్లు శిరీష్ హిట్ కొడతాడా?

ఇటీవల అలీ నిర్మించిన ఓ సినిమా రిలీజ్ అవ్వగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పేరు రాగా అలీ మాట్లాడుతూ.. ”అలీతో సరదాగా కార్యక్రమంలో బాలు గారు, పూరి జగన్నాధ్, అల్లు అరవింద్, వినాయక్ ఎపిసోడ్లు నాకు బాగా నచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ షోకి కచ్చితంగా వస్తారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలు, షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. అయన ఈ షోకి వస్తానని నాకు చెప్పారు. కచ్చితంగా త్వరలో పవన్ కళ్యాణ్ అలీతో సరదాగా కార్యక్రమానికి వస్తారు. ఇక పవన్ సినిమాల్లో దర్శకులు నాకు పాత్ర ఇస్తే కచ్చితంగా చేస్తాను” అని తెలిపారు. దీంతో పవన్ అభిమానులు వీరిద్దరూ కలిసి త్వరగా మళ్ళీ కనపడాలని కోరుకుంటున్నారు.