Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్?

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 08:39 PM

Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్?

Charan – Arjun : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్టులను అందుకోవడంతో, ఆ తరువాత నటించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్టులు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ ఇద్దరి స్టార్స్ నో చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Mega Power Star Ram Charan receives True Legend “#FutureofyoungIndia” award in Delhi

ఆ డైరెక్టర్ ఎవరంటే.. ‘గజినీ’ సినిమాతో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న డైరెక్టర్ ‘ఎ.ఆర్. మురుగదాస్’. వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు అభిమానులను అనుకున్నంత రీతిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. కాగా ఇటీవల ఈ దర్శకుడు అల్లు అర్జున్ కి కథ వినిపించాడట.

కథ నచ్చినప్పటికీ బన్నీ నో చెప్పాడట. కారణం పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునేందుకు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ కారణంతోనే మురుగదాస్ కి నో చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఇదే కథని దర్శకుడు మురుగదాస్, రామ్ చరణ్ కి కూడా వినిపించాడట. అయితే చరణ్ కూడా పాన్ ఇండియా స్క్రిప్ట్ కారణంతోనే నో చెప్పాడని ఫిల్మ్ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.