Balakrishna : బింబిసార దర్శకుడితో బాలయ్య సినిమా?

గత ఏడాది ఎవరు ఊహించని విధంగా విజయాన్ని అందుకున్న చిత్రం 'బింబిసార'. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కేశాడు దర్శకుడు వశిష్ట. దీంతో ఈ దర్శకుడు తదుపరి సినిమాపై అందరూ ఆశక్తి ఎదురు చూస్తున్నారు. కాగా ఈ దర్శకుడు రెండో సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది.

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 06:02 PM

Balakrishna : బింబిసార దర్శకుడితో బాలయ్య సినిమా?

Balakrishna : గత ఏడాది ఎవరు ఊహించని విధంగా విజయాన్ని అందుకున్న చిత్రం ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఎప్పుడు కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే కళ్యాణ్ రామ్.. ఈ మూవీతో కొత్త దర్శకుడు మల్లిడి వశిష్టని పరిచయం చేశాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కేశాడు వశిష్ట. దీంతో ఈ దర్శకుడు తదుపరి సినిమాపై అందరూ ఆశక్తి ఎదురు చూస్తున్నారు.

తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పిన బాలయ్య..

కాగా ఈ దర్శకుడు రెండో సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది. వశిష్ట తరువాత సినిమా బాలకృష్ణతో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇటీవల బాలయ్యని కలిసి ఒక పాయింట్ చెప్పాడు. అది బాగా నచ్చడంతో బాలకృష్ణ కూడా ఒకే చెప్పాడట. ఇప్పటి వరకు ఎవరు చేయని జోనర్లో ఈ కథ ఉండబోతుంది అని సమాచారం. బింబిసార సినిమాలో కూడా టైం ట్రావెల్‌ని, పిరియాడికల్ స్టోరీని కనెక్ట్ చేసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాడు ఈ దర్శకుడు.

దీంతో ఇప్పుడు ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నాడో అని అందరిలో ఆశక్తి నెలకుంది. ప్రెజంట్ బాలయ్య, అనిల్ రావిపూడితో ఒక సినిమాకి సైన్ చేశాడు. అది పూర్తి అవ్వగానే ఈ మూవీ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియదు. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ సెట్ కావాలంటూ కోరుకుంటున్నారు. కాగా బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందించాడు.